డిగ్రీలు చూపించలేనోళ్లు మన సర్టిఫికేట్లు అడుగుతున్నారు: ప్రకాశ్ రాజ్

డిగ్రీలు చూపించలేనోళ్లు మన సర్టిఫికేట్లు అడుగుతున్నారు: ప్రకాశ్ రాజ్

నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పే చర్చా ఈవెంట్ సందర్భంగా పీఎం ముందు డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలని ప్రశ్నించారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన యంగ్ ఇండియా నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సభలో పాల్గొని మాట్లాడారు. 

‘ఎవరైతే సీఏఏ సర్టిఫికేట్లు అడుగుతున్నారో.. వాళ్లు డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లేవు. పైగా పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో ఆయనకు డిగ్రీలు ఉండే ఉంటాయి కానీ చూపించడం లేదు. ప్రధాని ఇప్పుడు చూడు.. ప్రజలే నీకు పొలిటికల్ సైన్స్ నేర్పించి నిన్ను సాగనంపుతారు’ అని తిట్టిపోశాడు. 

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై ఆందోళన చేస్తున్నవారంతా విద్యావంతులు. కానీ, రాజ్యాంగం గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు.  ప్రధాని మోడీ పునర్జన్మ ఎత్తిన హిట్లర్‌లా ఉన్నాడు. మీరు మా సేవకుడు. మీ పని మీరు చేయండి. మీకు నిజంగా పనే చేయాలనుంటే నిరుద్యోగుల జాబితా సిద్ధం చేయండి. లేదా నిరక్షరాస్యతతో మగ్గిపోతున్న వారి జాబితా రెడీ చేయండి’

‘దేశంలో 70శాతం మంది పేదవారిగానే ఉన్నారు. వారంతా చదువులేని వారు. వారి వద్ద డాక్యుమెంట్లు లేవు. మా దగ్గర నుంచి ఓట్లు లాక్కొని ఇప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్లు చేస్తున్నారా..’ అని ప్రశ్నించారు.