ఆర్టీసీ సమ్మె : సుప్రీం మాజీ జస్టిస్ లతో కమిటీ వేస్తాం : హైకోర్ట్ 

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 11:04 AM IST
ఆర్టీసీ సమ్మె : సుప్రీం మాజీ జస్టిస్ లతో కమిటీ వేస్తాం : హైకోర్ట్ 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని తెలిపింది.

గ్గురు మాజీ జస్టిల కమిటీ విషయంపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపాలని అడ్వకేట్ జన్ రల్ కు సూచించింది. అది కూడా రేపటిలోగా కోర్టుకు తెలియజేయాలని సూచించింది. దీంతో అడ్వకేట్ జన్ రల్ కోర్టుకు సమాధానం చెప్తూ..ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏజీ తెలిపారు.  

విచారణలో భాగంగా..కోర్టుకు ఉన్న అధికారాలను..పరిధులను సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర రావు వివరించారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి   వస్తుందని..ఎస్మా కింద సమ్మెను చట్ట విరుద్ధంగా పరిగణించవచ్చు అని తెలిపారు.
1998-2015లో  సమ్మెను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. 1998లో ఇచ్చిన జీవోను ఏసీఎస్   ఆర్టీసీకి వర్తిస్తుందన్న హైకోర్ట్ టీఎస్ ఆర్టీసీకి అది వర్తించబోదని స్పష్టంచేసింది. ఇక 2015 జీవో ప్రకారంగా చూసినా..ఎస్మా 6 నెలలకే వర్తిస్తుందని తెలిపింది.