మరో ఛాన్స్ : ఓటర్ల జాబితా..టోల్ ఫ్రీ నెంబర్ 1950

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 02:55 AM IST
మరో ఛాన్స్ : ఓటర్ల జాబితా..టోల్ ఫ్రీ నెంబర్ 1950

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేదా ? లేకపోతే ఓటర్ల లిస్టులో ఏదైనా తప్పు జరిగిందా ? ఈ అవకాశాన్ని మరోసారి వినియోగించుకొనేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. నగర వాసులు సలహాలు, సూచనలు తెలియవచ్చని, ఫిబ్రవరి 02వ తేదీ శుక్రవారం ఫోన్ చేయవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పేర్కొన్నారు. ఇందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఉపయోగించుకోవచ్చన్నారు.