హైదరాబాద్ ట్రాఫిక్ టెర్రర్ : 10 కిలోమీటర్లే.. గంట టైం

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 05:07 AM IST
హైదరాబాద్ ట్రాఫిక్ టెర్రర్ : 10 కిలోమీటర్లే.. గంట టైం

హైదరాబాద్ :  ట్రాఫిక్ నరకం కొనసాగుతోంది. తమకు ఈ బాధ ఎప్పుడు తీరుతుందా ? అని నగర వాసులు ప్రశ్నించుకుంటున్నారు. జీవితంలో సగం ట్రాఫిక్‌ జామ్‌లోనే గడిచిపోతోంది. 90 శాతం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు వీడడం లేదు. కిలో మీటర్ల పొడవుతా రద్దీ ఏర్పడడం కామన్ అయిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో దారుణంగా తయారై పోయింది. ఖైరతాబాద్, మియాపూర్, అమీర్ పేట, బాలానగర్, సికింద్రాబాద్, ప్యారడైజ్, లక్డీకపూల్, మెహిదీపట్నం, కోఠి, మొజంజాహీ మార్కెట్, అప్జల్ గంజ్..ఇలా అనేక రూట్లలో నిత్యం రద్దీనే.

ఉదయం బయలుదేరింది మొదలు సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు రోడ్లపైనే జనాలు ఎక్కువ సేపు గడిపేస్తున్నారు. 10 కిలో మీటర్ల ప్రయాణానికి గంట సమయం పడుతుందంటే ట్రాఫిక్ ఏ మేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 20 నుంచి 30 కిలో మీటర్ల ప్రాంతాల్లో ఉన్నా ఆఫీసులు, స్కూళ్లు, ఇతరత్రా పనులకు వెళ్లే వారు 4 నుంచి 6 గంటల సమయం కోల్పోవాల్సి వస్తోందని అంచనా. 

నగరంలో ట్రాఫిక్ కష్టాలు…తగ్గడం కాదు.. ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రయాణీకులు నరకయాతన పడుతున్నారు. వాహనాల సంఖ్య అధికమవుతుండడంతో ఈ సమస్య సవాల్‌గా పరిగణమిస్తోంది. గ్రేటర్ పరిధిలో వాహనాలు 50 లక్షలకు చేరుకున్నట్లు అంచనా. రద్దీ కారణంగా సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎప్పుడు.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియని పరిస్థితి. జర్నీకే ఎక్కువ టైమ్ పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ట్రాఫిక్ కారణంగా టైంకి ఆఫీసులకు వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. మెట్రో పనుల కారణంగానూ కొన్ని ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంటోంది.