చిట్టి ‘రోడియో’:హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ రోబోలు..

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 04:29 AM IST
చిట్టి ‘రోడియో’:హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ రోబోలు..

హైదరాబాద్‌ : పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్‌ రహదారులపై దర్శనమివ్వనుంది.  బిజీ బిజీ నగరంలో ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పుకోనక్కర లేదు..ఎవరి హడావిడిలో వారు..ఎవరి పనులలో వారు నిరంతరం హడావిడి..అదంతా హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తునే ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్‌లో పాదచారులు (వాకర్స్) ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రోబోటిక్స్‌ అనే సంస్థ విద్యార్థులతో ఓ రోబోను ఆవిష్కరించింది. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో హైదరాబాద్ రోడ్లపై త్వరలోనే ఈ ట్రాఫిక్ రోబోలు సందడి చేయనున్నాయి.
 

రోబోటిక్స్‌ లో ట్రైనింగ్ తీసుకున్న ఆరుగురు విద్యార్థులతో కలిసి రెండు నెలల పాటు కష్టపడి ‘రోడియో’ పేరిట చిన్న సైజు రోబోను రూపొందించారు. పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాదారులను ఈ రోడియో అప్రమత్తం చేస్తుంది. రోబో మధ్యలో ఉండే తెరలో ట్రాఫిక్‌ నిబంధనలు కనిపిస్తాయి. ఈ రోబోను వాహనాల బ్యాటరీ ద్వారా ఛార్జింగ్‌ చేయగా..ఒకసారి పూర్తిగా ఛార్జింగ్‌ అయిన తర్వాత ఐదు గంటలపాటు నిర్విరామంగా పనిచేస్తుంది రోబో. ప్రస్తుతం పలు స్కూల్స్ లోని స్టూడెంట్స్ కు ట్రాఫిక్‌పై ఎవైర్ నెస్ కల్పించేందుకు నిర్వాహకులు దీన్ని వినియోగిస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి రహదారులపై వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.