Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

munugode bypoll-2022

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

‘‘ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే బీజేపీ, టీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకున్నాయి. ప్రజా ప్రతినిధుల కొనుగోలు కోసం బీజేపీ, టీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేశాయి. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపింది. మునుగోడులో నాయకుల జేబులు నిండాయి తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్, బీజేపీ.. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడంతో నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోంది. పోడు భూములను లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు.

Viral video: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. అతడి బైకు మాత్రం ముక్కలు ముక్కలు

పట్టా భూముల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడమే గుజరాత్ మోడలా? కేసీఆర్ పర్యటన పేరుతో పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతల్ని గృహ నిర్బంధం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. అదే రోజు మునుగోడు చార్జిషీట్ విడుదల చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు టీఆర్ఎస్ కార్యక్రమాలుగా మారాయి. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదు. నా నియోజకవర్గంలో రెండు కలెక్టరేట్లు ప్రారంభిస్తే నన్ను ఆహ్వానించలేదు. తెలంగాణను ఆక్రమించుకోవలని మోదీ బయల్దేరారు. తెలంగాణ మోడల్ పేరుతో దేశాన్ని ఆక్రమించుకోవాలని కేసీఆర్ బయల్దేరారు. గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌లో ఆజాద్‌గా వెలిగారు. ఇప్పుడు మోదీకి గులాంగా మారారు. 50 ఏళ్లు భుజాలపై మోసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇప్పుడు దూషిస్తున్నారు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.