Telangana: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావు: బండి సంజ‌య్

తెలంగాణ‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఇవాళ ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో త‌మ నేత‌లు ఎవరెవ‌రు ఎక్కడెక్క‌డ‌ నుంచి పోటీ చేయాలనేది త‌మ‌ పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు.

Telangana: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావు: బండి సంజ‌య్

Bandi Sunjay

Telangana: తెలంగాణ‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఇవాళ ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో త‌మ నేత‌లు ఎవరెవ‌రు ఎక్కడెక్క‌డ‌ నుంచి పోటీ చేయాలనేది త‌మ‌ పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు. త‌మ‌కు ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డానే బాస్‌ల‌ని ఆయ‌న చెప్పారు.

తెలంగాణ‌లో ఇన్నాళ్ళు ప్రత్యామ్నాయం లేద‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం తాము ఉన్నామ‌ని, ఇక సీఎం కేసీఆర్‌ ఆటలు సాగ‌బోవ‌ని ఆయ‌న అన్నారు. అనేక ర‌కాల‌ మాఫియాల వెనుక టీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. హైదరాబాద్‌లో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయ‌న చెప్పారు.

తాము వారికి స్వేచ్ఛ‌గా వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తామ‌ని చెప్పారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్ కోరుకుంటోంద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ఉప ఎన్నిక రావ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి, బీజేపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బండి సంజ‌య్ మునుగోడు ఉప ఎన్నిక అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..