మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ : అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇవ్వనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 06:05 AM IST
మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ : అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇవ్వనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను కేసీఆర్ వివరించనున్నారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ మున్సిపల్ అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు.

గురువారం (జనవరి 9, 2020) ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు వివరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేసే సందర్భంగా తీసుకునే జాగ్రత్తలు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై నేతలకు వివరించనున్నారు.

పోటీ తవ్రంగా ఉండటంతో రెబల్స్ బెడద లేకుండా చూడాలని సూచించనున్నారు. టిక్కెట్లు ఆశించిన వారితోపాటు నాయకులందరినీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని చెప్పనున్నారు. ఒక్కమున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి ఊడుతుందని నేతలకు ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.