రోడ్డెక్కిన స్కూల్,కాలేజ్ బస్సులు : పోలీస్ సెక్యూరిటీతో జర్నీ

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 05:36 AM IST
రోడ్డెక్కిన స్కూల్,కాలేజ్ బస్సులు : పోలీస్ సెక్యూరిటీతో జర్నీ

ప్రభుత్వం చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. దసరా పండుగ..బతుకమ్మ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణీకులతో పాటు నగరంలోని ప్రయాణీకులంతా పలు ఇబ్బందులకు పడతున్నారు.
 
దీంతో ప్రభుత్వం ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామన్నా  ఏర్పాట్ల చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ లో  స్కూల్, కాలేజ్ బస్సులను రంగంలోకి దింపింది. 

కాగా సమ్మె జరుగుతున్న క్రమంలో బస్సులు నిలిపివేయటంతో ప్రయాణీకుల వద్ద నుంచి ఆటోవాలాలు..క్యాబ్ డ్రైవర్లకు పంట పండినట్లుగా ఉంది. రేట్లు అమాంతం పెంచేశారు. భారీ స్థాయిలో డబ్బులు గుంజుతున్నారు. చిన్నపాటి దూరానికే అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వేరేదారి లేక ఆటోలను..క్యాబ్ లనుప్రయాణీకులు ఆశ్రయిస్తున్నారు. దసరా, బతుకమ్మ పండుగలు..సెలవులను వెళ్లేవారికి ఆర్టీసీ సమ్మె చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. 

ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 2 వేల స్పెషల్ బస్సులు నిలిచిపోయాయి. 57వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. స్కూల్స్, కాంట్రాక్టు క్యారేజీ బస్సులు సిద్ధం చేసింది.

2వేల 100 అద్దె బస్సులు, 6వేల 900 స్కూలు బస్సులును ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల దగ్గర 144 సెక్షన్ విధించింది. అన్ని డిపోలు, బస్టాండ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో కొన్ని బస్సులను ఇప్పటికే అధికారులు రోడ్డెక్కించారు.