శాంతి భద్రతలకు ప్రాధాన్యం….సీఎం కేసీఆర్

  • Published By: chvmurthy ,Published On : September 9, 2019 / 07:45 AM IST
శాంతి భద్రతలకు ప్రాధాన్యం….సీఎం కేసీఆర్

రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2019 -20 బడ్జెట్‌ను సోమవారం సెప్టెంబర్ 9న శాసనసభలో  ప్రవేశపెడుతూ  ఆయన… శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను కూడా ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించిందని చెప్పారు. 

గతంలో కొత్తగా ఏర్పాటు చేసిన 7 పోలీసు కమిషనరేట్లసంఖ్యను తొమ్మిదికి పెంచిందని పేర్కొన్నారు. పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు పెంచినట్లు సీఎం తెలిపారు. 

కొత్తగా 102 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొత్తంగా పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కు పెంచినట్లు సీఎం కేసీఆర్‌ వివరించారు.