శుభవార్త : TSLPRB కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 01:07 AM IST
శుభవార్త : TSLPRB కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. అధికారులు ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 17 వేల 156 పోస్టులకు గాను..13 వేల 373 మంది పురుషులు, 2 వేల 652 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 

ఫలితాలను https.//www.tslprb.in/ వెబ్ సైట్‌లో చూడవచ్చు. 

రాత పరీక్షల్లో 90 వేల మంది అభ్యర్థులు ఇప్పటికే అర్హత సాధించారు. సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్ తదితర విభాగాల ఫలితాలకు కలిపి ఎంపికయ్యారని టీఎస్ఎల్ పీఆర్‌బీ వెల్లడించింది. అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు ఉంటే..సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్థానిక ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. వేయి, ఇతరులు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https.//www.tslprb.in/ వెబ్ సైట్‌లో సందర్శించాలని సూచించారు. 

గత సంవత్సరం స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం రాత పరీక్ష, దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం అప్పటి నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.