ఆన్ డ్యూటీ సర్ : కార్మికుల మరణాలకు యూనియన్ల లీడర్లే కారణం – డ్రైవర్

  • Published By: madhu ,Published On : November 3, 2019 / 09:06 AM IST
ఆన్ డ్యూటీ సర్ : కార్మికుల మరణాలకు యూనియన్ల లీడర్లే కారణం – డ్రైవర్

కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయనతో 10tv మాట్లాడింది. తోటి డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరాలని సూచించారు. జీతం వస్తేనే..ఇళ్లు నడిచే పరిస్థితి చాలా మందిలో ఉందని..రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సీఎం ప్రోగ్రాం చూసి..తాను డ్యూటీకి వచ్చేసినట్లు వెల్లడించారు. విలీనం అనేది అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 

అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. 2019 నవంబర్ 05వ తేదీలోగా విధుల్లో చేరాలని, లేనిపక్షంలో వారు ఉద్యోగాలు కోల్పోతారని..కార్మికుల పొట్టకొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. దీంతో పలువురు కార్మికులు డ్యూటీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.

డిపోల్లో సమ్మతి పత్రాలను అందిస్తున్నారు. కామారెడ్డిలో విధుల్లో చేరేందుకు డ్రైవర్, సిరిసిల్లలో డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు మెకానిక్‌లు సిద్ధమయ్యారు. సిద్ధిపేట డిపోలో సమ్మతిపత్రం అందించాడు కండక్టర్. విధుల్లో చేరే కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీనిస్తున్నారు. ఎవరైనా బెదిరిస్తే..డయల్ 100కు కంప్లయింట్ చేయాలని సూచించారు. 
Read More : సమ్మె ఆపము.. డ్యూటీ ఎక్కము : తేల్చి చెప్పిన ఆర్టీసీ జేఏసీ