ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 01:07 AM IST
ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం

ఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు చేసుకొనే వారు, విద్యార్థులు, శివార్లలో ఉంటూ నగరంలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే వారు, ఎన్‌జీవోలు, బస్ పాస్‌లు తీసుకున్న సామాన్యులు..ఇలా మొత్తం 33 లక్షల మంది నగర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న సమ్మె ఎప్పుడు ముగుస్తుందా ? బస్సులు ఎప్పుడు తిరుగుతాయా అంటూ వేచి చూస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీరు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కనీసం కాలు కూడా పెట్టడానికి వీలు లేని బస్సుల్లో వేలాడుతూ..ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. మహిళల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. 

తెల్లవారు జాము 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు..రాత్రి 7 గంటల నుంచి 11 నుంచి 12 గంటల వరకు బస్సులు తిరగడం లేదు. అరకొరగా తిరుగుతున్న బస్సుల్లో నగర ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా జీతాలందక ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు వామనాల్లో ప్రయాణం భారం పెరిగి సామాన్యుల ఇంటి బడ్జెట్ సైతం తల్లకిందులైంది. జీతంలో అధికభాగం ప్రయాణ ఖర్చులకే అయిపోయిందని వాపోతున్నారు. రూ. 10 వేలు సంపాదించే వ్యక్తి ఖర్చు తడిసి మోపెడు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు. 
Read More : న్యాయం కావాలి : రెవెన్యూ అధికారులపై రైతన్నల నిరసన