పాదాచారులు మెట్రో స్టేషన్‌లు ఉపయోగించుకోవచ్చు

  • Published By: madhu ,Published On : May 13, 2019 / 05:01 AM IST
పాదాచారులు మెట్రో స్టేషన్‌లు ఉపయోగించుకోవచ్చు

మెట్రో రైలు ఎక్కడానికి ఏర్పాటు చేసిన స్టేషన్లను ఎవరు ఉపయోగిస్తారు ? రైలు ఎక్కడానికి వెళ్లే వారు ఉపయోగించుకుంటారు అని అంటారు కదా. సాధారణ ప్రజలు ఎందుకు ఉపయోగించుకోరు. అటు వైపు నుండి ఇటు వైపు వెళ్లడానికి ఉపయోగించుకొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాదాచారుల వంతెనలు లేకపోయినా మెట్రో స్టేషన్లను సైతం అలాగే ఉపయోగించుకోవచ్చు. పలు స్టేషన్ల ఎదుట మెట్రో స్టేషన్‌ను ఉపయోగించుకోండి అంటూ బోర్డులు పెడుతున్నారు. 

మహానగరంలో అనేక ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్ లేకుండా ప్రయాణం సాగించే విధంగా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. చౌరస్తా వద్ద యూ టర్న్ విధానాన్ని అమలు చేశారు. దీనితో రయ్యి రయ్యి మంటూ వాహనాలు వెళుతున్నాయి. అయితే..రోడ్డు దాటాలంటే పాదాచారులు భయపడిపోతున్నారు. వీరి కష్టాలు పెరిగిపోయాయి. కొన్ని సార్లు వాహనాలు ఢీకొని పలువురు గాయపడుతున్నారు కూడా. 

మెట్రో నిర్మాణానికి ముందు కూకట్ పల్లి, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో పాదాచారుల వంతెనలుండేవి. వీటిని తొలగించారు. రోడ్డు మధ్యలో మొదటి, రెండు అంతస్థులను మెట్రో స్టేషన్లను నిర్మించారు. మొదటి అంతస్తు వరకు ఫ్రీగానే వెళ్లవచ్చు. నాలుగు వైపుల నుండి లిఫ్ట్‌లు, మెట్లు, ఎస్కలేటర్లున్నాయి. వీటిని ఉపయోగించి స్టేషన్ మొదటి అంతస్తు నుండి మరోవైపుకు దిగవచ్చు. ఇలా రెండు దిక్కుల్లోనూ అవకాశం ఉంది. బేగంపేట, పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లు రోడ్డు దాటేందుకు ఉపయోగించుకోవచ్చు. సో..మెట్రో స్టేషన్లను సైతం పాదాచారుల వంతెనలుగా ఉపయోగించుకోవచ్చు.