కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే కాదు.. డీ విటమిన్ కావాలి

కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే కాదు.. డీ విటమిన్ కావాలి

CoronaVirus Vitamin D: కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక రీసెర్చర్స్, సైంటిస్టులు తలలు పట్టుకొంటుంటే.. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ఎంత జరిగినా దానికంటే ముందే కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మహమ్మారికి పాత టెక్నిక్ విటమిన్‌-డీతో చెక్‌ పెట్టవచ్చని వైద్యులు అంటున్నారు. గాంధీ, నిమ్స్‌ డాక్టర్లు కరోనాపై ఇలాంటి పరిశోధన జరపడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని అంటున్నారు.

కరోనా కట్టడి సాధ్యమైందిలా:
కరోనా పేషెంట్‌లో సీఆర్పీ, ఐఎల్‌-6 (ఇంటర్‌ లుకిన్‌-6), ఎన్‌/ఎల్‌ (న్యూట్రోఫిల్‌ లింఫోసైడేషియో), సీరం ఫెరిటిన్‌, ఎల్డీహెచ్‌ (ల్యాక్టేట్‌ డీ హైడ్రోజనిల్‌)లు నార్మల్ లెవల్ కంటే ఎక్కువ ఉంటున్నట్లు మెడికల్ టెస్టుల్లో తేలింది. అటువంటి వారికి విటమిన్‌-డీ అందిస్తే సీఆర్పీ తదితర ఇన్‌ఫెక్షన్లు తగ్గినట్టు గమనించారు. 80 నానోగ్రామ్‌/ఎంఎల్‌ చొప్పున రోగులకు విటమిన్‌-డి అందివ్వడంతో ఆబ్జెక్టివ్స్‌ (సీఆర్పీ, ఐఎల్‌-6) నార్మల్ లెవల్‌కి చేరాయి. అలా కరోనా కట్టడి సాధ్యమైంది. రీసెర్చ్ వివరాలను త్వరలోనే నేచర్‌ జర్నల్‌కు పంపనున్నారు.

రోజుకు 80 నానో గ్రాములు:
ఒకొక్కరి మిల్లీ లీటర్‌ రక్తంలో 30 నానోగ్రాముల నుంచి 100 నానోగ్రాముల వరకు విటమిన్‌-డీ ఉండాలి. 94 శాతం మందిలో 30 నానోగ్రామ్‌ కంటే తక్కువ ఉంటున్నట్లు నిమ్స్‌ డాక్టర్లు గుర్తించారు. విటమిన్‌-డీని తగినంత అందిస్తే కరోనా రోగులు కోలుకుంటారా లేదా అనే అంశంపై గాంధీ, నిమ్స్‌ దవాఖానాల వైద్యులు సంయుక్తంగా పరిశోధన నిర్వహించగా అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.


కరోనా రోగులపై రీసెర్చ్
గాంధీలో చికిత్స పొందిన 130 మంది కరోనా రోగులపై ఈ రీసెర్చ్ నిర్వహించారు. ప్రతి రోగికి 80 నానోగ్రామ్‌/ఎంఎల్‌ విటమిన్‌-డీ ప్రామాణిక స్థాయిని నిర్దేశించుకొని పరిశోధన నిర్వహించారు. 30 నానోగ్రామ్‌ దాటితే ఇన్‌ఫెక్షన్స్‌ పర్సంటేజ్ తగ్గుతోంది. 60 నానోగ్రామ్‌ దాటితే రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు ఆటో ఇమ్యూనిటి ప్రభావం తగ్గుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని 80 నానోగ్రాములను పారామీటర్‌గా నిర్ణయించినట్టు డా.మహేశ్‌ లక్కిరెడ్డి వెల్లడించారు.