వాలెంటైన్స్ డే : భజరంగ దళ్ హెచ్చరికలు 

10TV Telugu News

హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజు కోసం ఎన్నో యువ జంటలు ఎదురు చూస్తుంటాయి. గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవటం..సరదాగా కలిసి తిరగటం..రెస్టారెంట్స్, పార్క్ లకు తిరిగేందుకు..ఏకాంతంగా గడిపేందుకు  ప్రేమ జంటలు ఆసక్తి చూపుతుంటాయి. వీరికి ఏకాంతానికి భంగం కలించేందుకు..భజరంగ్ దళ సభ్యులు కూడా సిద్ధమైపోతున్నారు. భారత సంప్రదాయం కాని ప్రేమికుల రోజును జరుపుకుంటే దాడులు తప్పబోవని భజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. 
 

ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ పేరుతో ..ప్రేమ జంటలు బయట కనిపిస్తే…వారిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో  హాజరుపరిచి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని భజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు సుభాష్ చందర్. ప్రేమికుల రోజు పేరిట పబ్ లు, మాల్స్, హోటల్స్ లో స్పెషల్ ఈవెంట్లు జరిపితే దాడులు తప్పవని హెచ్చరించారు. రహదారులు, పార్కులపై ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని అన్నారు. ఫిబ్రవరి 14న అన్ని చౌరస్తాల్లోను వాలెంటైన్స్ దిష్టి బొమ్మలను దహనం చేయడం ద్వారా తమ నిరసనలను తెలియజేసి..నల్ల జెండాలను ప్రదర్శిస్తామని తెలిపారు.