Vivek On tickets Issue: కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.. నన్ను పోటీ చేయొద్దన్నారు: మాజీ ఎంపీ వివేక్

ఉప్పల్​ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ టికెట్ల విషయంలో వివాదం రాజుకోవడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఎంపీ వివేక్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వివేక్ ఆరోపించారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా తనను పోటీ చేయొద్దని కేసీఆర్ అన్నారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారికి హెచ్‌సీఏ పదవి ఎందుకని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. హెచ్‌సీఏలో నెలకొన్న పరిస్థితులకు కేసీఆర్ కుటుంబ సభ్యులే కారణమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ తీరు సరికాదని ఆయన అన్నారు.

Vivek On tickets Issue: కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.. నన్ను పోటీ చేయొద్దన్నారు: మాజీ ఎంపీ వివేక్

Vivek On tickets Issue: ఉప్పల్​ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ టికెట్ల విషయంలో వివాదం రాజుకోవడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఎంపీ వివేక్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వివేక్ ఆరోపించారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా తనను పోటీ చేయొద్దని కేసీఆర్ అన్నారని ఆయన చెప్పారు.

రాజకీయాల్లో ఉన్నవారికి హెచ్‌సీఏ పదవి ఎందుకని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. హెచ్‌సీఏలో నెలకొన్న పరిస్థితులకు కేసీఆర్ కుటుంబ సభ్యులే కారణమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ తీరు సరికాదని ఆయన అన్నారు. కాగా, మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు సికింద్రాబాద్ లోని​ జింఖానా మైదానం వద్దకు భారీగా తరలిరావడం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వాహకుల నుంచి వివరణ తీసుకున్నారు.

Hyderabad T20 Match: రేపటి మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియానికి ఇలా వెళ్లి, వస్తే ఎంతో సౌకర్యవంతం