వరంగల్ కానిస్టేబుల్ ఉదార హృదయం.. మొదటి జీతమంతా పేదలకే

వరంగల్ కానిస్టేబుల్ ఉదార హృదయం.. మొదటి జీతమంతా పేదలకే

Warangal Constable: సాయం చేయడానికి స్తోమత కాదు కావాల్సింది మనసుండాలి. మనిషి పెద్దరికం అనేది వయస్సుతో రాదు చేసే పనులను బట్టి వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్ గా అపాయింట్ అయిన పేదింటి యువతి తొలి జీతాన్ని ఆసరా లేని వాళ్లకు ఇచ్చేసింది. తానేమీ స్థితిమంతుల బిడ్డనో.. దుబారా ఖర్చు చేసే వ్యక్తిత్వం ఉన్న మహిళనో కాదు.

తండ్రి లేని బిడ్డ. తల్లి బీడీ కార్మికురాలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అనూష.. పేదరికంలోనే ఎంఏ బీఈడీ వరకూ చదువుకుంది. ప్రైవేట్ టీజర్ గా పనిచేస్తూనే పోలీస్ కానిస్టేబుల్ అయింది. ప్రజలకు సర్వీసు అందించే వృత్తిలో ఉన్న ఆమె.. మొదటి జీతాన్ని కూడా పేదవారికే ఇచ్చేయాలని నిశ్చయించుకుంది.

అదే సంకల్పంతో మొదటి వేతనాన్ని ఆహారం సమకూర్చడానికి ఉపయోగించానని రానున్న రోజుల్లో శక్తి మేరకు మరింత సాయపడతానని అనూష చెబుతోంది. పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.