Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ

యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరిగిందని రుజువైంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అతం పలకపబోతున్నాం.

Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అంతం పలకబోతున్నామని అన్నారు అసోం సీఎం హిమంత విశ్వ శర్మ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాని మోదీపై ఉన్న అనేక ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రధాని నేతృత్వంలోని బీజేపీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి

అగ్నిపథ్ ద్వారా దేశ రక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడటమే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకు ప్రధాని మోదీని అభినందించాం. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరిగిందని రుజువైంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అతం పలకపబోతున్నాం. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ప్రకటించడం వల్ల వెనుకబడిన వర్గాలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటాము. రానున్న రోజుల్లో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు మరింత సమర్ధంగా పనిచేయాలని తీర్మానించాం’’ అని హిమంత విశ్వ శర్మ అన్నారు.