ఓన్లీ ఫుల్..నో హాఫ్ : క్యాప్ హెల్మెట్ ధరిస్తే ఫైన్

  • Published By: madhu ,Published On : October 3, 2019 / 03:41 AM IST
ఓన్లీ ఫుల్..నో హాఫ్ : క్యాప్ హెల్మెట్ ధరిస్తే ఫైన్

పోలీసు జరిమానాల నుంచి తప్పించుకొనేందుకు వాహనదారుల కొత్త కొత్త ఎత్తగడలు వేస్తుంటారు. హెల్మెట్ మస్ట్ అని చెబుతుండడంతో కొంతమంది హాఫ్ హెల్మెట్లను ధరిస్తూ రయ్యి రయ్యి మంటూ తిరుగుతున్నారు. తాము హెల్మెట్ పెట్టుకున్నామని..జరిమానాలు విధించరని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అంత సీన్ లేదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటే..ఫైన్ కట్టాల్సిందేనంటున్నారు. వాహనదారుల ప్రాణాల కోసమేనంటున్నారు. వితవుట్ హెల్మెట్ అని ఈ చలాన్‌లు జారీ అవుతుండడంతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా..హాఫ్ హెల్మెట్ క్యాప్‌గా పరిగణిస్తామని చెప్పడంతో షాక్ తింటున్నారు వాహనదారులు. 

హాఫ్ హెల్మెట్లు వాడుతున్న చాలా మంది ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. MV ACT ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే హెల్మెట్ అని, అది ఉంటేనే ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు తీవ్రగాయాలు కాకుండా..ప్రాణాలు నిలబడుతాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అందుకే చట్ట ప్రకారం వితవుట్ హెల్మెట్ అనే ఆప్షన్‌తో జరిమాన విధిస్తున్నామంటున్నారు. 

వాహనదారులు పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకొనేందుకు హాఫ్ హెల్మెట్లు వాడుతున్నారని, ఇది వారికి మంచిది కాదంటున్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఆ హెల్మెట్ గాయాల తీవ్రతను తగ్గించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 
Read More :