వెదర్ అప్ డేట్ : మళ్లీ పెరిగిన చలి తీవ్రత 

రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రెండు, మూడు రోజులు చలి తగ్గినట్లున్నా.. చలి మళ్లీ పెరిగింది.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 11:42 PM IST
వెదర్ అప్ డేట్ : మళ్లీ పెరిగిన చలి తీవ్రత 

రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రెండు, మూడు రోజులు చలి తగ్గినట్లున్నా.. చలి మళ్లీ పెరిగింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రెండు, మూడు రోజులు చలి తగ్గినట్లున్నా.. చలి మళ్లీ పెరిగింది. మంచు దుప్పటి కప్పేస్తోంది. మంచు కురుస్తున్న కారణంగా చలి తీవ్రత అధికమవుతోంది. మెదక్ లో శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 13, రామగుండంలో 15, హైదరాబాద్ లో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటోంది. మాల్దీవుల నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు భూమికి 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమ గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. గాలిలో తేమ పెరుగుదల సాధారణం కంటే 20 శాతం దాకా ఉంది. పగలు సైతం చల్లగా ఉండటానికి ఇదే కారణం. ఇదే తరహా ఉష్ణోగ్రతలు మరో 3 రోజులు రాత్రివేళల్లోనూ కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.