వెదర్ అప్ డేట్ : వర్షం కురిసే అవకాశం

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 02:22 AM IST
వెదర్ అప్ డేట్ : వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలో మంగళవారం (ఏప్రిల్ 30,2019) ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫొని తుఫాన్ ఉత్తర వాయ్యవ దిశగా ప్రయాణించి సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ట్రింకోమలీ(శ్రీలంక) దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఇది కొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా, ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్-45.3
నిజామాబాద్-45
రామగుండం-43.8
మెదక్-43.6
ఖమ్మం-42.4
భద్రాచలం-42
మహబూబ్ నగర్-41.9
హన్మకొండ-41.5
హైదరాబాద్-41.4