నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 01:12 AM IST
నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుండి మూడు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.