వెదర్ అప్ డేట్ : చలి చంపుతోంది

చలిపులి మళ్లీ పంజా విసిరింది. అకాల వర్షం అగగానే చలి తీవ్రత అధికమైంది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 12:07 AM IST
వెదర్ అప్ డేట్ : చలి చంపుతోంది

చలిపులి మళ్లీ పంజా విసిరింది. అకాల వర్షం అగగానే చలి తీవ్రత అధికమైంది.

హైదరాబాద్ : చలిపులి మళ్లీ పంజా విసిరింది. అకాల వర్షం అగగానే చలి తీవ్రత అధికమైంది. పగలు, రాత్రి తేడా లేకుండా చలి తీవ్రత అత్యధికంగా పెరిగి విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఏడెనిమిది డిగ్రీల వరకు తగ్గిపోతున్నాయి. అదిలాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 7, రామగుండంలో 12, నిజామాబాద్, హైదరాబాద్, హన్మకొండ, మెదక్ లలో 13 డిగ్రీలు నమోదు అయ్యాయి. తీవ్రతరమవుతున్న చలి గాలుల వల్ల పగలు, రాత్రి మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండటం లేదు.

భద్రాచలంలో సోమవారం పగలు 21 ఉంటే, రోజు రాత్రి 13 డిగ్రీలుంది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీచే శీతల గాలుల తాకిడి తెలంగాణపై పెను ప్రభావం చూపుతోంది. పొగ మంచు కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.