ఫస్ట్ వీళ్లకే : పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్‌ విధానం అమలు

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 02:20 AM IST
ఫస్ట్ వీళ్లకే : పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్‌ విధానం అమలు

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్‌ విధానం అమలు చేస్తామని కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. వెస్ట్ జోన్ లోని సిబ్బందికి వారాంతపు సెలవు ఇచ్చారు. వెస్ట్ జోన్ లోని 1367 మంది పోలీసులకు వీక్లీ ఆఫ్ వర్తిస్తుంది. దశల వారీగా హైదరాబాద్ నగరం అంతా వారాంతపు సెలవు విధానాన్ని అమలు చేస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీక్లీ ఆఫ్ విధానంపై పోలీసు ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తోందని త్వరలోనే నిర్ణయం తీసుంటామని చెప్పారు. సీఎం ఆదేశాలతో అధికారులు వీక్లీ ఆఫ్ విధానంపై వర్కవుట్ చేశారు. 

అన్ని ప్రభుత్వ విభాగాల కంటే పోలీస్‌ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చాలా కఠినంగా ఉంటాయి. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ప్రముఖుల భద్రత, ట్రాఫిక్‌ ఇలా ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. పైగా డ్యూటీలో టైమింగ్స్ ఉండవు. ఒక్కోసారి రెస్ట్ లేకుండా రోజుల తరబడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోలీస్ సిబ్బందికి చాలా టెన్షన్స్ ఉంటాయి. తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ప్రెజర్స్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో కనీసం వారానికి ఒకసారి సెలవు లేకుంటే మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు పోలీసులు తమ కుటుంబానికి దాదాపు దూరమనే చెప్పాలి. ఈ పరిస్థితిలో కనీసం వారంలో ఒకరోజైనా తమతో గడిపే అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఒత్తిడి నుంచి రిలాక్స్ కోసం పోలీసులకు కూడా వారాంతపు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానవతా దృక్పథంలో ఆలోచన చేసిన వారాంతపు సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసులు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కి థ్యాంక్స్ చెప్పారు.