భార్య చాటింగ్: భర్త ఆత్మహత్య, అయినా పట్టించుకోలేదు

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 06:22 AM IST
భార్య చాటింగ్: భర్త ఆత్మహత్య, అయినా పట్టించుకోలేదు

కుటుంబంలో చిచ్చు పెట్టిన చాటింగ్

భార్యా భర్తల మధ్య విభేదాలు..

భర్త చావును కూడా పట్టించుకోని భార్య

సోషల్ మీడియాతో ఏర్పడుతున్న సరికొత్త బంధాలు..

అనాధలుగా మారుతున్న చిన్నారులు 

హైదరాబాద్  : టెక్నాలజీని మిస్ యూజ్ చేసుకుంటున్న క్రమంలో ఎన్నో అనర్ధాలకు దారి తీస్తోంది. కొత్తకొత్త ఆలోచనలు..కొత్త పరిచయాలు..స్నేహాలు…వంటి బంధాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో పచ్చని కుటుంబాలు కూలిపోతున్నాయి. బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి.  ఈ క్రమంలో భర్తకు చాటుగా భార్య,  భార్యకు తెలియకుడా భర్త కొత్త స్నేహాల వలలో కుటుంబాలు కూలిపోతున్నాయి. పిల్లలు దిక్కుతోచనివారిగా మారిపోతున్నారు. ఈ క్రమంలో భర్తకు తెలియకుండా భార్య చేస్తోన్న ఛాటింగ్ ఓ కాపురాన్ని కూల్చేసింది. ఓ చిన్నారిని అనాథను చేసింది. కడప జిల్లా పులివెందుల మండలం గోటూరుకు చెందిన చరణ్ రెడ్డి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఓ చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పావని అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బాబుకూడా పుట్టాడు. కొంతకాలం బాగానే వున్న వారి కాపురంలో చాటంగ్ చిచ్చురేగింది. 

భార్య పావని ఫోన్ కు మెసేజ్‌లు రావటం..భర్త వారించినా..నచ్చచెప్పినా భార్య వినకపోవటం..భర్తకు చాటుగా పావని ఛాటింగ్ చేస్తుండటంతో గొడవలు తలెత్తాయి. అవికాస్తా తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బాబుని భర్త వద్దే వదిలేసి పావని పుట్టింటికి వెళ్లిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకును చూసుకోవటం..భార్య గుర్తుకు రావటంతో తీవ్ర మనస్థాపానికి గురైన చరణ్ జనవరి 10న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పావనికి సమాచారం అందించారు. అయినా ఆమె నమ్మలేదు..దీంతో వారు వాట్స్ఏప్ ఫోటో తీసి పంపించినా ఆమె భర్తను చూసేందుకు కూడా రాకపోవటంతో స్థానికులు విస్తుపోయారు. 

స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి  కేసు నమోదు చేసుకుని..చరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైసు తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు లేరో తెలినీ ఆ పసిబిడ్డ అనాధలా గుక్కపట్టి ఏడుస్తున్న దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో స్థానికులే పిల్లాడిని చేరదీస్తున్నారు. ఇంత జరిగినా భర్తకోసం పావనీ రాలేదు..కన్నబిడ్డను కూడా పట్టించుకోకపోవటంతో ఆ చిన్నారి బ్రతుకు అగమ్యగోచరంగా మారిపోయింది. స్థానికులు మాత్రం ఎంతకాలమనీ చూస్తారు..