Kidnap at Sucunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన యువతి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది ఓ యువతి. రైల్వే స్టేషన్ లో తల్లి పక్కన ఉండి ఆడుకుంటున్న ఏడాది బాలుడి వద్దకు వచ్చిన ఓ యువతి అతడిని స్టేషన్ బయటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న ఆటోలోకి ఆ బాలుడిని ఎక్కించి తీసుకెళ్లింది. బాలుడు కనిపించకపోవడంతో ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kidnap at Sucunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన యువతి

Kidnap at Sucunderabad railway station

Kidnap at Sucunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది ఓ యువతి. రైల్వే స్టేషన్ లో తల్లి పక్కన ఉండి ఆడుకుంటున్న ఏడాది బాలుడి వద్దకు వచ్చిన ఓ యువతి అతడిని స్టేషన్ బయటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న ఆటోలోకి ఆ బాలుడిని ఎక్కించి తీసుకెళ్లింది. బాలుడు కనిపించకపోవడంతో ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ అపహరణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీని గుర్తించడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ యువతికి ఎక్కి వెళ్లిన ఆటో ఎటువైపు వెళ్లిందనే విషయంతో పాటు పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన యువతి ఎవరనే విషయాన్నీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..