డాక్టర్ల నిర్వాకం : రోడ్డుపైనే గర్భిణి ప్రసవం

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించే పరిస్థితికి దారితీసింది.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 10:08 AM IST
డాక్టర్ల నిర్వాకం : రోడ్డుపైనే గర్భిణి ప్రసవం

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించే పరిస్థితికి దారితీసింది.

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించే పరిస్థితికి దారితీసింది. ఎల్బీనగర్ లో ఈ ఘటన జరిగింది. హయత్ నగర్ తారామతి పేటకు చెందిన  మరియమ్మ పురిటి నొప్పులతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. శనివారం(మార్చి 6, 2019) పండుగ కావడంతో డాక్టర్లు లేరని సిబ్బంది చెప్పారు. నొప్పులతో బాధపడుతున్నా ఎలాంటి జాలి, దయ  చూపలేదు. వేరే ఆస్పత్రికి వెళ్లాలని ఆమెను అక్కడి నుంచి పంపేశారు. మరో దారి లేక మరియమ్మను ఆమె భర్త అక్కడి నుంచి కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. ఇంతలో నొప్పులు ఎక్కువయ్యాయి.  ఎల్బీనగర్ దగ్గర రోడ్డుపైకి రాగానే మరియమ్మ ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచింది. 
Read Also : తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన

ఇది గమనించిన స్థానికులు 108 కి కాల్ చేశారు. అక్కడికి వచ్చిన 108 సిబ్బంది మరియమ్మకు ప్రాథమిక చికిత్స అందించారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సిబ్బంది తీరుపై అంతా మండిపడుతున్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను వెంటనే అంబులెన్స్ లో పక్కనున్న ఆస్పత్రికి తరలించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ వారు అవేమీ పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు. గతంలోనూ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సిబ్బంది ఇలాగే వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. 
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి