ప్రపంచ రోగ నిరోధక వారం : టీకాలు వేయించడం లేదు

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 04:21 AM IST
ప్రపంచ రోగ నిరోధక వారం : టీకాలు వేయించడం లేదు

నగరంలోని చిన్నారులకు టీకాలు వేయించడం లేదు. వ్యాధుల నివారణకు టీకాలు ఉచితంగా వేస్తున్నా..తల్లిదండ్రుల్లో అవగాహన లేక పిల్లలకు టీకాలు వేయించడం లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 23 – 29 వరకు ప్రపంచ రోగ నిరోధక వారం నిర్వహిస్తుంటారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు తరచూ రోగాల బారిన పడుతుంటారు. చిన్నప్పటి నుండి సరైన టీకాలు అందించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. జాతీయ కుటుంబ హెల్త్ సర్వే ప్రకారం దాదాపుగా 30 శాతం చిన్నారులకు ఇప్పటికీ టీకాలు అందడం లేదు.

దాదాపు కోటి జనాభా ఉంది నగరలో. 1500 పైగా మురికివాడలున్నాయి. ఆయా ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు ఆరోగ్య సేవలందించేందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు వీరు నిరంతరం స్టడీ చేస్తుంటారు. అంతేగాకుండా గర్భిణీల సంఖ్య నమోదు చేయాలి. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో వీరి లెక్కలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతింటికి వెళ్లి టీకాలు అందించాల్సిన బాధ్యత వీరిది. 

వాస్తవానికి పుట్టిన వెంటనే ఇచ్చే టీకాలతో పాటు అయిదో ఏ పాఠశాలకు వెళ్లే వరకు వివిధ దశల్లో టీకాలు అందించాలి. కానీ..ఒకటి రెండేళ్లు టీకాలు ఇచ్చి మానేస్తున్నారు. దీని కారణంగా పాఠశాలలకు వెళ్లే సమయంలో డిప్తీరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. 90 శాతం అరికట్టే వ్యాధులకు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు అందిస్తోంది. ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో వీటిని అందిస్తుంటారు. టీకాలైతే ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. నెల వయస్సు నుండి 5 ఏళ్లున్న చిన్నారికి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు టీకాలు వేయించాలో ప్రత్యేక రికార్డులో ఉంటుంది. ఆ ప్రకారం ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవచ్చు.