పార్టీ చేసుకుని ప్రాణం తీసేశారు: బీరు బాటిల్ తో దాడి 

10TV Telugu News

బాలాపూర్ : నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని మైకంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 3)న మద్యం మత్తులో ఓ యువకుడి తలపై బీరుసీసాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ లోని అలీ నగర్ లో చోటుచేసుకుంది. 
 

హుస్సేన్ సాది స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. స్నేహితుడు ఇఫ్తేకార్ ఇంట్లో.. హుస్సేన్ సాది, చాంద్ పహిల్వాన్, ఇఫ్తేకార్, అజీజ్ మద్యం తాగారు. అక్కడి వరకూ సరదా సరదాగా గడిపిన తరువాత తాగిన మత్తులో సాది (37)తో ఘర్షణకు దిగి విచక్షణారహితంగా బీరుసీసాలతో హుస్సేన్ తలపై బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రువాత వారంతా భయపడ్డారు. హుస్సేన్ సాది చనిపోయాడుని తెలుసుకున్నవారికి మత్తు దిగిపోయింది. దీంతో డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నారు.  అందరూ కలిసి మృతదేహాన్ని మాయం చేయడానికి దుప్పట్లో చుట్టి..జనాలు తిరగని ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. తరువాత ఏమీ తెలియనట్లుగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. హుస్సేన్ సాది ఇంటికి రాకపోవటంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తుల్ని విచారించగా ఒక వ్యక్తి  అసలు విషయాన్ని వారు తెలిపాడు.  దీంతో సంఘటనాస్థలికి చేరుకుని హుస్సేన్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలినవారు పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

×