Vijaya Shanthi: నన్ను ఎందుకు పక్కనపెట్టారో బండి సంజయ్‌నే అడగాలి: విజయ శాంతి

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను కొంతకాలంగా ఎందుకు సైలైంట్‌గా ఉన్నానో బండి సంజయ్‌నే అడగాలన్నారు.

Vijaya Shanthi: నన్ను ఎందుకు పక్కనపెట్టారో బండి సంజయ్‌నే అడగాలి: విజయ శాంతి

Vijaya Shanthi: బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీ నటి విజయ శాంతి. తనకు ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని ప్రశ్నించారు. తాను కొంతకాలంగా ఎందుకు యాక్టివ్‌గా లేనో బండి సంజయ్‌నే అడగాలని సూచించారు. గురువారం విజయశాంతి 10 టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

‘‘కరోనా కారణంగా కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉన్నాను. 24 ఏళ్లు బీజేపీలో పనిచేశాను. ఇప్పుడు ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలి. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవు. ప్రజా సమస్యలపై ఎవరికి అవగాహన ఉంటే వాళ్లను పార్టీలో ముందు వరుసలో ఉంచాలి. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. అధిష్టానం దిశానిర్దేశం చేయాలి. ఈ రోజు మీడియాతో మాట్లాడదామనే వచ్చాను. పార్టీ నన్ను ఉపయోగించుకోవడం లేదనే భావిస్తున్నా. నేను కొంతకాలంగా పార్టీలో ఎందుకు యాక్టివ్‌గా లేనో బండి సంజయ్‌ని అడిగితే బాగుంటుంది. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తా. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తా. పార్టీలో నాకు పాత్ర లేకుండా చేయాలనుకుంటున్న వారిని పాతరేయాలని ఆగ్రహంగా ఉంది. నేను అసంతృప్తితో ఉన్నానని మీకు అనిపిస్తోందా? ఫైర్ బ్రాండ్ అయిన నన్ను ఎందుకు సైలెంట్‌లో పెట్టారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి.

Salman Rushdie: సల్మాన్ ఇంకా బతికే ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది: హత్యాయత్నం నిందితుడు

పని చెప్తే కదా.. పార్టీ కోసం పనిచేసేది. పని ఇవ్వకుండా చేయమంటే నేనేం చేయాలి. జాతీయ నాయకత్వంతో ఇబ్బంది లేదు. రాష్ట్ర నాయకత్వమే నన్ను ఉపయోగించుకోవడం లేదు. టీం వర్క్‌తో పనిచేస్తేనే బీజేపీ విజయం. ఒకరిద్దరితో అధికారంలోకి రాలేము. సీనియర్ నేతలను కలుపుకొని పోకుంటే పార్టీకే నష్టం. విజయశాంతి వలన కొందరు అభద్రతాభావంలో ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టాలి. బీజేపీ వల్లే తెలంగాణకు ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతున్నా. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.