లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

నాకేం జబ్బూ లేదు.. బాగానే ఉన్నా: అమిత్ షా

Published

on

I am absolutely healthy, not suffering from any illness: Amit Shah

కేంద్ర హో మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు కౌంటర్ ఇచ్చారు. పలు సోషల్ మీడియా అకౌంట్లలో ఆధారాలు లేకుండా అమిత్ షా ఆరోగ్యంతో లేరని.. అమిత్ షాకు సంతాపం వహించండంటూ రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. వారందరికీ స్పష్టమైన సమాధానమిస్తూ.. కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో బిజీగా ఉన్న అమిత్ షా సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 

‘ఈ రూమర్లన్నీ నా వరకూ వచ్చాయి. ఇలాంటి ఫాంటసీల్లో ఎంజాయ్ చేస్తున్న వారిని అలానే ఉంచుదాం. అప్పుడే ఎందుకు వారి సంతోషాన్ని ఆపేయడం అని రెస్పాండ్ అవలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అమిత్ షా ట్వీట్ చేసి గంట తర్వాత గుజరాత్ పోలీసులు భావ్ నగర్, అహ్మదాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను హోంమంత్రిపై రూమర్లు వ్యాప్తి చేసినందుకుగానూ అరెస్టు చేశారు. 

‘మా పార్టీ కార్యకర్తలు, లక్షల మంది శ్రేయోభిలాషులు రెండ్రోజులుగా బాధపడుతున్నారు. వారి ఆలోచనలను నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. ఈ కారణంతో ఇటువంటి రూమర్లతో నాన్‌సెన్స్ వ్యాప్తి చేయకండి. నా పని నన్ను చేసుకోనివ్వండి’ అని హోం మంత్రి పేర్కొన్నారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముందుగా అమిత్ షా ట్వీట్ పై స్పందించారు. ఆయన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. మీకు దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం మీరు ఆరోగ్యంగా ఉండాలి.. మాకు మార్గనిర్దేశం చేస్తూ ఉండాలని ట్వీట్ చేశారు. 

Read More :

టార్గెట్‌ థౌజెండ్ : మోడీ మాస్టర్ ప్లాన్..భారత్ కు 1000 కంపెనీలు!

డాక్టర్ సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే పేరు… నాన్ బెయిలబుల్ వారెంట్‌తో అరెస్టు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *