శ్రావణి కేసులో నేను లేను..అతడిని కొట్టినట్లు ప్రూఫ్ చేస్తే ఎన్ కౌంటర్ చేయండి – సాయి కృష్ణారెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Telugu actress Sravani suicide case : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తాను లేనని, పంజాగుట్ట వద్ద దేవ్ రాజ్ ను కొట్టినట్లు ప్రూఫ్ చేస్తే ఎన్ కౌంటర్ చేయాలని అన్నాడు సాయి కృష్ణారెడ్డి. తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల ఎదుట విచారణకు హాజరువుతున్నట్లు తెలిపారు. తన దగ్గరున్న ఆధారాలను వారికిస్తానని చెప్పాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దేవ్ రాజ్ ప్లే బాయ్ అంటూ తెలిపారు.తనపై చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కాదని వెల్లడించాడు. దేవ్ రాజ్ సేఫ్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని, అతనివల్లే టార్చర్ అనుభవించిందని, తమకు చెబితేనే దేవ్ రాజ్ తెలుసన్నాడు. దేవ్ రాజ్ ను శ్రావణి ప్రేమిస్తే…అతడిపై ఎందుకు కేసు పెట్టిందని ప్రశ్నించాడు. పంజాగుట్ట కేసు సమయంలో దేవ్ రాజ్ కు వాటార్ బాటిల్ ఇచ్చానని, విశ్వాసం లేదన్నారు.హోటల్ దగ్గర కేవలం ఓపెన్ గా చెప్పు..అని మాత్రమే శ్రావణిని అడిగినట్లు చెప్పాడు. లిఫ్ట్ దగ్గర తనను తిట్టాడని మధ్యలో దేవ్ రాజ్ వచ్చాడన్నారు. కుటుంబసభ్యులను ట్రాప్ పెట్టే అంత..సీన్ లేదని ఉంటే..శ్రావణిని ఎందుకు ట్రాప్ పెట్టలేదన్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు..ట్రాపింగ్ చేయడం వల్లే..ఆమె చనిపోయిందని, బలైపోతున్నట్లు శ్రావణి చెప్పిందన్నారు సాయి కృష్ణారెడ్డి.

టీవీ నటి శ్రావణి సూసైడ్‌ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్‌నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు.శ్రావణి సూసైడ్‌ కేసు క్రైమ్‌ సీరియల్‌ను తలపిస్తోంది. తొలుత దేవరాజ్‌ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్‌ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది.

సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి సూసైడ్‌ మిస్టరీలో సాయి పాత్ర ఎంత ఉందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆడియో క్లిప్పింగులు, సీసీ పుటేజీల ఆధారంగా శ్రావణిపై సాయి వేధింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. విచారణలో సాయి చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి.శ్రావణితో ఐదేళ్ల క్రితం నుంచే సాయికి పరిచయం ఉంది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. అయితే కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో శ్రావణి చాలా క్లోజ్‌గా ఉండటం సాయికి నచ్చలేదు. ఇదే విషయంలో శ్రావణి, సాయికి మధ్య వాగ్వాదం జరిగింది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలు శ్రావణి కేసులో.. సాయి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయిని విచారించి.. కేసులో అసలు నిందితున్ని గుర్తించనున్నారు పోలీసులు.

READ  '83' టైటిల్ పోస్టర్ విడుదల

తన చావుకు సాయి కారణమని.. తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారనే విషయాన్ని శ్రావణి దేవరాజ్‌కి చెప్పిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసుల విచారణలో దేవరాజ్‌ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనూ తనను రక్తం వచ్చేలా సాయి కొట్టాడని సాక్ష్యాలను బయటపెట్టాడు.శ్రావణి నేను కావాలి.. ఇది ఫైనల్‌ అంటూ ఫోన్‌లో సాయికి దేవరాజ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఐదేళ్లుగా ప్రేమిస్తుంటే మధ్యలో నువ్వు వచ్చావని సాయి అన్నాడు. శ్రావణిని ఫోన్‌లైన్‌లో ఉంచి ఎవరిని లవ్‌ చేస్తున్నావో చెప్పాలని దేవరాజ్‌ నిలదీశాడు. దేవరాజ్‌నే ప్రేమిస్తున్నానని శ్రావణి చెప్పింది. మధ్యలో ఉండి డ్రామాలు చేయొద్దంటూ సాయికి దేవరాజ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఎవరు విలన్ రానున్న రోజుల్లో తేలనుంది.

Related Posts