చిరుని ఫాలో అయిన బాలయ్య బ్యూటీ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Radhika Apte Marriage Secret: తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ ‘లయన్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ Radhika Apte తాజాగా త‌న పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏ మాత్రం న‌మ్మ‌క‌ం లేద‌ని.. పెళ్లి చేసుకోవడానికి గల కారణం చెప్పింది. అయితే సులభంగా వీసా వ‌స్తుంద‌న్న కార‌ణంతోనే పెళ్లి చేసుకున్నానంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… విదేశాల్లో ఉన్న వ్య‌క్తిని పెళ్లాడితే వీసా సులువుగా వ‌స్తుంద‌ని తెలుసుకొని, తాను పెళ్లి చేసుకున్న‌ానని.. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి లండన్‌లో ఉంటున్నానని తెలిపింది. కాగా రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ Benedict Taylor ను వివాహం చేసుకుంది.

‘జై చిరంజీవ’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అమెరికా వెళ్లడానికి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన భూమికను పెళ్లి చేసుకున్నట్లు.. వీసా ఈజీగా వస్తుందని విదేశాల్లో ఉన్న వ్య‌క్తిని వివాహం చేసుకుందన్నమాట రాధికా ఆప్టే.
ప్రస్తుతం లండన్‌లో స్థిర‌నివాసం ఏర్పరుచుకున్న రాధికా ఆప్టే బాలీవుడ్‌లో సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తుండడంతో ఎక్కువశాతం భారత్‌లోనే ఉంటోంది.

Related Tags :

Related Posts :