గురుకులంలో బాలిక సూసైడ్: రేప్ చేసి చంపేశారంటోన్న పేరెంట్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నోయిడాలోని అర్ష్ కన్యా గురుకుల్ పాఠశాలలో 14ఏళ్ల బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సెక్టార్ 115లో జులై 3 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు హర్యానాలో ఉంటారు. 13ఏళ్ల సోదరి కూడా అదే స్కూళ్లో చదువుకుంటుంది. ఆ సమయానికి స్కూళ్లో 45మంది స్టూడెంట్లు, టీచర్లు, స్టాఫ్ మెంబర్లు ఉన్నట్లు చెబుతున్నారు.

ఘటన గురించి పేరెంట్స్‌కు, ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. బాధితురాలి పేరెంట్స్ ఉదయం 10గంటల 30నిమిషాలకు స్కూల్ కు చేరుకున్నారు. అక్కడకు చేరుకోగానే వారి వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నట్లు బాధితురాలి తల్లి ఆరోపించింది. ఫ్యాన్ కు ఉరివేసుకున్న గదికి తీసుకెళ్లి చూపించారు. దాంతో పాటుగా బాలిక రాసిన సూసైడ్ నోట్ కూడా చూపించారు.

‘స్కూల్ అధికారులు బాలికను త్వరగా ఖననం చేయాలని ఫోర్స్ చేశారు. పోలీసులు బాలిక చనిపోవడం వెనుక కారణాలను ఇన్వెస్టిగేట్ చేయనున్నారు’ అని బాధిత కుటుంబం తెలిపింది. స్కూల్ అధికారులు ఘటన గురించి పోలీసులకు తెలియపరచకపోవడం తమ తప్పేనని ఒప్పుకుంది.

‘బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆ గది నుంచి సేకరించాం. ఆమె చావు వెనుక ఏ కారణం లేదు. చావుకు గురుకులం వారు కానీ, కుటుంబ సభ్యులు గానీ కారణం కాదు’ అని నోయిడా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. ‘నాకు బ్రతకడానికి ఏ కారణం లేదు. నేను బతికి ఎవరికీ బరువు కావాలనుకోవడం లేదు’ అని రాసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

బాలిక చనిపోవడానికి ముందు రోజు తన చెల్లితో గొడవపడి క్లాస్ లో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఓ విద్యార్థి చెప్పారు. ఘటన జరిగిన ఉదయం 3గంటల నుంచి తప్పుదోవ పట్టించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబ సభ్యులు బాలికను స్కూళ్లో రేప్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. నోయిడా పోలీసులు కేస్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Related Posts