I-T SLETHUES RAID HOMES OF KANANADA FILM STARES

సీఎం భార్యనూ వదల్లేదు : చందన సీమలో ఐటీ కలకలం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చందనసీమలో గురువారం ఉదయం ఐటీ దాడులు కలకలం రేపాయి. శాండిల్ వుడ్ ప్రముఖల ఇళ్లల్లో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  సీఎం కుమారస్వామి రెండవ భార్య, నటి రాధికా కుమారస్వామి, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, సుదీప్, కేజీఎఫ్ నటుడు యశ్,  ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ నివాసాల్లో , కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 
2019, జనవరి 3వ తేదీ ఉదయం రెండు  బృం దాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మొత్తం 25 ప్లేస్ లలో సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత, నల్లధనాన్ని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టి తెల్లధనంగా మార్చుకోవడం, బ్యాంకు రుణాల ఎగవేత వంటి ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. దాడుల్లో అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts