నా మీద బురదజల్లితే… ప్రకాశంలో టీడీపీని స్వీప్ చేస్తా…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ‌ నేతలపై వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. కారులో దొరికిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నా మీద బురద జల్లి ప్రయత్నం చేస్తే.. ప్రకాశంలో టీడీపీని స్వీప్ చేస్తానని చెప్పారు. అసలు కారు స్టిక్కర్, అందులోని డబ్బు తనది కాదని స్పష్టం చేశారు.

బొండా ఉమ నోరు అదుపులోకి పెట్టుకోవాలని, ఏం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడాలని హితవు పలికారు. తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోనన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ఉన్నానని, ఏ ఒక్కరూ కూడా చెడుగా మాట్లాడిన పరిస్థితి లేదన్నారు.

కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ తనది కాదని, ఆ డబ్బు తనదని నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా వెంటనే రాజీనామా చేస్తానని చెప్పారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి విరమిస్తానని అన్నారు. దొరికిన డబ్బు తనదని నిరూపించలేని పక్షంలో ఆరోపణలు చేసిన బొండా ఉమా చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ నేత నారా లోకేష్ పై కూడా మంత్రి బాలినేని విమర్శించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు లోకేశ్ కూడా క్షమాపణలు చెప్పాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.

Related Posts