ఎన్నికల్లో గెలిచాను – ట్రంప్ ట్వీట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

“I Won Election” Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా తానే గెలిచానంటూ..ఇంకా డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తగిలిన ఎదురు దెబ్బను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేది లేదంటున్నారు. మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అధ్యక్ష పీఠం కోసం మోసాలకు పాల్పడుతున్నారంటూ..వాపోయారు. తానే గెలిచానంటూ..ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.ఐ వన్ ది ఎలక్షన్ అంటూ చేసిన ట్వీట్ కు నెటిజన్లు ట్రోల్ చేస్తూ..కామెంట్స్ పెడుతున్నారు. వరుసగా ఆయన ట్వీట్లు చేశారు. బైడెన్ గెలిచినట్టు అంగీకరిస్తూనే..ఆయన ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ట్వీట్ ను ట్విట్టర్ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్టు కింద ఒక హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.అంతేగాకుండా…రిగ్గింగ్ ఎన్నికలుగా అభివర్ణించారు. మీడియా ఫేక్ కథనాల్లోనే బైడెన్ గెలిచినట్లు, దీనిని తాను అంగీకరించబోనని ట్రంప్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ కు సూచించారు. తాజా ఎన్నికల ప్రకారం..పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్లు స్పష్టమౌతోందని, ట్రంప్ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే…ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీన పడిందని భావిస్తాయని చెప్పుకొచ్చారు.అహాన్ని పక్కన పెట్టి..దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలంటూ సూచించారు. జో బైడెన్ చేతిలో ట్రంప్ చిత్తుగా ఓడిపోయారని డెమొక్రటిక్ వర్గాలు సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం..స్టేట్ బై స్టేట్ ఎలక్టోరల్ సిస్టంలో బైడెన్ 306 ఓట్లను గెలుచుకున్నారు. నవంబర్ 03వ తేదీన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :