ఆప్​ ఏర్పాటు వెనుక బీజేపీ కుట్ర…రాహుల్ గాంధీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ​ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్​ లోక్​పాల్​ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్పటి UPA ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు RSS-BJP కుట్ర చేశాయని. రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్​ను అధికారం నుంచి తప్పించి గద్దెనెక్కడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి బీజేపీ-ఆర్​ఎస్​ఎస్​ పెద్ద ఎత్తున మద్దతిచ్చాయని ఆప్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్​ ప్రస్తావించారు. ఈ కుట్రల గురించి అందరికీ తెలిసిన విషయాన్ని ఆప్​ వ్యవస్థాపక సభ్యుడు ధ్రువీకరించారని రాహుల్ ట్వీట్​ చేశారు.


అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో ప్రశాంత్​ భూషణ్​ ఒకరు. ఆమ్​ ఆద్మీ పార్టీ స్థాపనకు ఈ ఉద్యమం ప్రధాన కారణం. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 2015లో ప్రశాంత్​ భూషణ్​, యోగేంద్ర యాదవ్​ను ఆమ్​ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

Related Posts