లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

IAF’s first woman ఆఫీసర్ విజయలక్ష్మి కన్నుమూత

Published

on

iafs-first-woman-officer-vijayalakshmi-ramanan-retd-dies : కమిషన్ మహిళా అధికారి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) డాక్టర్ విజయలక్ష్మి రమణన్ తుదిశ్వాస విడిచారు. పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె…2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం కన్నుమూశారు. 96 ఏళ్లు ఉన్న ఈమె..బెంగళూరులోని తన కూతురు నివాసంలో ఉన్నారు.1924 ఫిబ్రవరిలో విజయలక్ష్మి జన్మించారు. మెడిసన్ చదివిన ఈమె..గైనకాలజిస్టుగా ప్రాక్టిస్ చేశారు. 1955లో ఆర్మీలో చేరారు. ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ లో రిక్రూట్ అయ్యారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. IAF (భారత వాయుసేన)లో తొలి మహిళా ఆఫీసర్ గా రికార్డు సృష్టించారు.అందరూ ఈమెను ఆఫీసర్ 4971గా పిలిచేవారు. 1972లో ఆగస్టులో వింగ్ కమాండర్ హోదాలో పదోన్నతి పొందారు. Vishisht Seva Medal (VSM) మెడల్ గెలుచుకున్నారు. 24 సంవత్సరాల పాటు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన విజయలక్ష్మి 1979లో వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు. అంతా మగవారు ఉన్నా..వారికి ధీటుగా పనిచేశారామె. తన కెరీర్ లో లింగ వివక్ష ఎదుర్కొనలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.విజయలక్ష్మి, దివంగత భర్త కూడా ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా పనిచేశారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న రమణన్‌ చాలా చిన్న వయస్సులో అల్‌ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్‌గా పని చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *