చెక్ ఇట్ : IBPS లో 3వేలకు పైగా ప్రొబెషనరీ, మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

IBPS PO 2020 notification:
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) లో ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 3517 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటికే కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ (CRP) -X నోటిఫికేషన్ విడుదలై.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ కు ఆగస్టు 5,2020 నుంచి ఆగస్టు 26, 2020 వరకు దరఖాస్తు చేసినవాళ్లు, అక్టోబర్‌ 3, 10, 11 తేదీల్లో జరిగిన IBPS PO Prelims 2020 పరీక్షకు హాజరైనా వాళ్లు మళ్లీ అప్లయ్‌ చేయాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు విడుదల చేస్తారు.విభాగాల వారీగా ఖాళీలు :
కెనరా బ్యాంక్- 2100
యుకో బ్యాంక్- 350
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 734
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 250
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 83

విద్యార్హత : అభ్యర్దులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి.వయస్సు : అభ్యర్దుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్దులు రూ.850 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : అక్టోబర్ 28, 2020.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 11, 2020.
ప్రిలిమినరీ ఎగ్జామ్: జనవరి 5, 2021/జనవరి 6, 2021.

Related Tags :

Related Posts :