లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

మన ఫస్ట్ మ్యాచ్ వాళ్లతోనే : T-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ విడుదల

Published

on

ICC T20 World Cup 2020 date, venue, schedule: India start against South Africa on October 24

మెన్స్  టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్  వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాలిఫైయర్స్ లో భాగంగా సౌతాఫ్రికాతో, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ తోపాటు భారత్ పూల్ Bలోఉండనుంది. ఆస్టేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ లు పూల్Aలో ఉండనున్నాయి. మొత్తం 16 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి. పెర్త్ లో అక్టోబర్ 24న జరిగే మ్యాచ్ లో ఈ టోర్నమెంట్ లో భారత్ ఫస్ట్ మ్యాచ్ సౌతాఫ్రికాతో తలపడనుంది. 

2018 చివరినాటికి ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది టాప్ ర్యాంకుల టీమ్ లు..పాకిస్థాన్, భారత్, ఇంగ్లాండ్, ఆస్టేలియా, సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్, వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్ లు నేరుగా అర్హత సాధించగా రెండు పూల్స్ గా వీటిని విభజించారు. సూపర్ 12 కోసం  మిగిలిన 4 టీమ్ లు మొదటి రౌండ్ తర్వాత నిర్ణయించబడతాయి. 9వ ర్యాంక్, 10వ ర్యాంక్ టీమ్ లు..శ్రీలంక(గ్రూప్ A), బంగ్లాదేశ్(గ్రూప్ B) లు ఫస్ట్ రౌండ్ కి ఆటోమేటిక్ గా అర్హత సాధించాయి. సిడ్నీ, అడిలైడ్ గ్రౌండ్స్ లో నవంబర్ 11, 12న జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మెల్ బోర్న్ గ్రౌండ్స్ లో నవంబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మొత్తం 45 మ్యాచ్ లు 16 జట్ల మధ్య ఆస్టేలియాలోని ఏడు ప్రాంతాల్లో జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది.

పురుషుల టీ-20 వరల్డ్ కప్ కంటే ముందుగా 2020లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు ఆస్ట్రేలియాలో మహిళల టీ-20 టోర్నమెంట్ జరుగనుంది.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *