ICMR sits on proposal to try Rs 5 arthritis drug in Covid cases

రూ.5కే కరోనా మరణాలను ఆపగలిగే మందు…ఇండోమెథాసిన్ ట్రయిల్స్ పై ICMR ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్-19మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా నమోదవుతున్న వేలాది మరణాలను నిరోధించగలిగే అతి చవకైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ డ్రగ్ ను ట్రయల్స్ కోసం పరిశీలించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది.

కరోనా మరణాలకు కారణంగా భావిస్తున్న సైటోకిన్ ఉధృతిని ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ డ్రగ్..ఇండోమెథాసిన్ ఉపయోగపడుతుందని చెన్నైకి  చెందిన కిడ్నీ మార్పిడీ సర్జన్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తెలిపారు. కిడ్నీ మార్పిడి రోగుల్లో సైటోకిన్ తీవ్ర ప్రభావాన్ని ఆపడానికి ఇండోమెథాసిన్ ఉపయోగించి సఫలమైనట్టు రవి చంద్రన్ తెలిపారు.ఈ మేరకు ఆయన ట్రయల్స్ కోసం తన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ తోపాటు, అమెరికా, కెనడా దేశాలకు ఏప్రిల్ 29 న పంపించారు. దీనిపై స్పందించిన UK డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్. వీటిని తమ చికిత్సా టాస్క్ ఫోర్స్(Therapeutic Taskforce) కు  పంపించినట్టు తెలిపింది. 

కోవిడ్-19 బాధితులపై దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చని రవిచంద్రన్  సూచించారు. అయితే  ఆశాజనక ఫలితాలకు పెద్ద ఎత్తున నిర్వహించే మెడికల్ ట్రయిల్స్ కీలకమన్నారు. ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ధర కేవలం రూ.5  మాత్రమే. మరోవైపు  కోవిడ్-19 రోగుల్లో ఇప్పుడు ఉపయోగించే  టోసిలిజుమాబ్ఒ క మోతాదు ధర రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. 

ఇప్పటివరకు కౌన్సిల్ దృష్టికి ఇలాంటి 185 ప్రతిపాదనలు వచ్చినట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ విభాగంలోని నిపుణులు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ అనాలిసిస్ తో కలిసి ఐసీఎంఆర్ ఒకదాని తరువాత మరొక ప్రతిపాదనను పరిశీలిస్తోందన్నారు.

మరోవైపు హైడ్రాక్సిక్లోరోక్విన్ కంటే ఇండోమెథాసిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని  బ్రూక్లిన్‌లోని ఒక ప్రధాన వైద్యుడు డాక్టర్ జోనాథన్ లీబోవిట్జ్ ప్రకటించారు. దీనిపై అదనపు పరిశోధనలు అవసరమని  ఆయన సూచించారు. దాదాపు 60మంది కరోనా రోగుల్లో సాధారణంగా కంటే ఎక్కువగా  ఇది  సమర్థవంతంగా  పనిచేసినట్టు తెలిపారు. అలాగే ఈ  ఔఫధానికి కావాల్సిన ప్రాముఖ్యతనివ్వడం లేదన్నారు.మరోవైపు కరోనా ట్రీట్మెంట్ లో ఇప్పటివరకు వాడుతూ వచ్చిన యాంటీ మలేరియా డ్రగ్….హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ)‌ క్లినికల్ ట్రయల్స్ ను  తాత్కాలికంగా  నిలిపివేస్తున్నట్టు WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)ప్రకటించిన విషయం తెలిసిందే.

Read: దేశంలో 1.45 లక్షలు దాటిన కరోనా కేసులు

Related Posts