ICSE, ISC పరీక్ష ఫలితాలు విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ త‌ర‌గ‌తి, ISC 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను ది కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఐసీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, ఐఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుదలయ్యాయి

10, 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఇండియ‌న్ స్కూల్ స‌ర్టిఫికెట్ ఎగ్జామినేష‌న్స్ వెల్ల‌డించింది. ఫ‌లితాల‌ను cisce.org, results.cisce.org అనే వెబ్ సైట్ల‌లో చూసుకోవ‌చ్చు అని సూచించింది. ఐసీఎస్ఈ 10 ఫ‌లితాల్లో 96.84 శాతం, ఐఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 99.34 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

కాగా.. ఈ సంవత్సరం 85,611 మంది ISC 12వ త‌ర‌గ‌తి విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు. ICSE 10 వ తరగతి పరీక్షలకు 2,07,902 మంది హాజరవ్వగా 99.34 శాతంతో రికార్డు స్థాయిలో 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Related Posts