Home » బీజేపీ గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: యోగి
Published
2 months agoon
By
subhnHyderabad: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ
సందర్భంగా హైదరాబాద్ పేరు ఎందుకు మారకూడదని దాన్ని భాగ్యనగర్ గా మారుస్తామని వ్యాఖ్యానించారు.
ఏఐఎమ్ఐఎమ్ కంచుకోట ఓల్డ్ సిటీని వేదికగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చేశాం. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చేశాం. ఇవన్నీ బీజేపీ అధికారంలోకి వచ్చాకే జరిగాయి. అలాంటప్పుడు హైదరాబాద్ పేరు ఎందుకు మారకూడదు’ అని ప్రశ్నించారు.
కొందరు నన్ను అడుగుతున్నారు హైదరాబాద్ పేరు మారుతుందా అని ఎందుకు కాకూడదు అని అంటున్నా. అంతకుముందు చేసినట్లుగానే హైదరాబాద్ పేరును కూడా మార్చగలం అన్నట్లు మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్ లో ఓ ఎమ్మెల్యే హిందూస్థాన్ అనే మాటను వ్యతిరేకించాడని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటైన బీహార్ అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఇది జరిగింది.
‘బీహార్‌లో కొత్తగా జరిగిన ఎన్నికల్లో ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సమయంలో హిందూస్థాన్ అనే మాటను సమ్మతించలేదు. వాళ్లు హిందూస్థాన్ లో ఉంటారు కానీ, అదే పదంతో ప్రమాణ స్వీకారం చేయరట. వాళ్లు ఏఐఎమ్ఐఎమ్ నిజ రూపాన్ని బయటపెట్టారని అన్నారు.
#WATCH | Some people were asking me if Hyderabad can be renamed as Bhagyanagar. I said – why not. I told them that we renamed Faizabad as Ayodhya & Allahabad as Prayagraj after BJP came into power in UP. Then why Hyderabad can’t be renamed as Bhagyanagar?: UP CM Yogi Adityanath pic.twitter.com/hy7vvSLH0z
— ANI (@ANI) November 28, 2020