If the film is to be shot, these rules must be followed Telangana Govt

సినిమా షూటింగ్ జరపాలంటే..ఈ నిబంధనలు పాటించాల్సిందే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినిమా షూటింగులకు పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… ఇందుకోసం కొత్త నిబంధనలు విధించింది. షూటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత బాధ్యత నిర్మాతలదేనని స్పష్టం చేసిన ప్రభుత్వం… చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోవచ్చని తెలిపింది.

షూటింగ్‌ లొకేషన్స్‌లో అందరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. డాక్టర్లు అందుబాటులో ఉండాలని.. ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులను అందుబాటులో ఉంచాలని సూచించింది. అంతేకాదు.. షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తీసుకోవాలని, చిత్రీకరణకు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని చెప్పింది. గరిష్ఠంగా 40 మంది సిబ్బందితో మాత్రమే షూటింగ్ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

మరోవైపు ఏపీ సర్కార్ కూడా షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చింది. ఈనెల 15న తర్వాత సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం జగన్ అనుమతినిచ్చారు. చిరంజీవి ఆధ్వర్యంలో కలిసిన సినీ పెద్దలకు ఈ మేరకు హామీ ఇచ్చారు సీఎం జగన్. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, విశాఖకు తరలి వస్తుందంటే ఆ పరిశ్రమకు అండగా నిలుస్తామన్నారు. నంది వేడుకల విషయాన్ని కూడా టాలీవుడ్ పెద్దలు ప్రస్తావించడంతో…. సీఎం సానుకూలంగా స్పందించారు. విశాఖలో 300 ఎకరాల కేటాయింపు అంశంపైనా సానుకూలంగా స్పందించారని చిరంజీవి చెప్పారు.
 

Related Posts