Home » ఆ ముగ్గురిలో : ధోనీ తర్వాత సూపర్ కింగ్స్‌కి కెప్టెన్?
Published
2 years agoon
By
subhn
చెన్నై సూపర్ కింగ్స్ అరంగ్రేట మ్యాచ్ నుంచి 2019 సీజన్ వరకూ కెప్టెన్‌గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టుకు నాయకత్వం వహించేది ఎవరు? అని సగటు అభిమాని మదిలో మెదిలే ప్రశ్నే.. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన మహీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
Read Also: ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు
ఐసీసీ వరల్డ్ కప్ 2019 తర్వాత ధోనీ రిటైర్మెంట్ అవుతాడని సీనియర్లు చెప్తోండగా.. ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసెదెవరు. టీమిండియాలో అయితే ప్రత్యామ్నాయంగా కీపర్లు, బ్యాట్స్‌మెన్ సిద్ధంగానే ఉన్నారు. తమిళనాట తాలా గా భావిస్తున్న ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మెప్పించి రాణించగల సత్తా ఎవరికుందంటే..
1. సురేశ్ రైనా:
సూపర్ కింగ్స్ జట్టు పేరు వింటేనే ముందు ధోనీ, తర్వాత రైనా గుర్తుకొస్తారు. జట్టుకు ధోనీ అన్నయ్య అయితే రైనా తమ్ముడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన రైనా ప్రతి సీజన్లో మెప్పిస్తూ అభిమానుల మన్ననలు పొందాడు. ధోనీతో పాటుగా 9 సీజన్లుగా ఒకే జట్టుకు ఆడి 32మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు ధోనీ దూరమైన సందర్భంలో జట్టుకు కెప్టెన్‌గా ముందుకు నడిపాడు.
2. డుప్లెసిస్:
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెన్నై అరంగ్రేట మ్యాచ్‌తో పాటుగా మళ్లీ 2012లో ఆ జట్టులో చేరి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు. టాపార్డర్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.గతేడాది జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లోనూ కీలకంగా మారి గేమ్ దిశను మార్చాడు. మరో ఐదేళ్ల పాటు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్న డుప్లెసిస్ కెప్టెన్ అయితే మాత్రం జట్టును మరింత ముందుకు తీసుకెళ్లగలడని భావిస్తున్నారు.
3. అంబటి రాయుడు
అంబటి రాయుడు ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్ జట్టులో ఆరంభించి 8 సీజన్లలో 114 గేమ్‌లు ఆడాడు. అందులో మూడు సీజన్లకు గాను ముంబై ఇండియన్స్ 3 టైటిళ్లు సాధించుకుంది. 2018 జరిగిన వేలంలో చెన్నై జట్టు కొనుగోలు చేసిన తర్వాత మరింత దూకుడుతో ఆడాడు. ఒక్క సీజన్లోనే 602పరుగులు చేసి జట్టుకు దన్నుగా నిలిచాడు. రాయుడు గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు.
Read Also: అదే కారణమా : హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌కు కూడా దూరమే