లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 50 శాతం బస్సులు నడుపుతాం : ఏపీఎస్ ఆర్టీసీ

Published

on

AP bus services to Telangana : తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే 50 శాతం బస్సులను నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులకు వారం క్రితమే ప్రతిపాదనలను పంపామన్నారు. టీఎస్ ఆర్టీసీ కోరినట్లుగానే రూట్ వైజ్ క్లారిటీ కూడా ఇచ్చామని తెలిపారు.ఇబ్బందులున్నా సర్వీసులు నడవాలని 1.6 లక్షల కిలోమీటర్లకు తగ్గామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిర్ణయం చెబుతామని అన్నారు. ఆన్ లైన్ టికెట్ల సంఖ్యను బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు రాకపోకలు నిలిచిపోయాయి.ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సంబంధించి కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సు సర్వీసులు నడపాలని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ప్రతిష్టంభన ఏర్పడింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *