మీలో ఈ 4 లక్షణాలు ఉన్నాయా? మీకు కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ.. మహమ్మారి కోవిడ్ వైరస్ మొదలై ఆరు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ కరోనా వైరస్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.. కరోనా లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.If You Have These 4 Symptoms, Chances Are High You Have COVID

అసలు కరోనా సోకిందా లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కరోనాలో రోజుకో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కరోనా తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది.. జలుబు లేదా అలెర్జీ వంటి ఇతర అనారోగ్యాలతో ముడిపడి ఉంది. ఈ వైరస్ ప్రభావం మీ తల నుంచి కాలి వరకు శరీరంలో ఏ భాగమైనా ప్రభావితం చేస్తుంది. ఫ్లూ, జలుబు లేదా అలెర్జీ వంటి ఇతర అనారోగ్యాల వల్ల చాలా సాధారణ లక్షణాలను గుర్తించడం కష్టంగా ఉంటుంది.taste
COVID-19 నాలుగు లక్షణాలు ఉన్నాయని చెబుతుంది. మీకు కరోనా సోకినట్లయితే మీలో ఈ లక్షణాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ సాధారణ COVID లక్షణాలలో దేనినైనా చూపించడం ప్రారంభిస్తే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

రుచి లేదా వాసన కోల్పోవడం :
మీ రుచి లేదా వాసన భావాన్ని కోల్పోయారా? ఏది తిన్నా రుచించడం లేదా? వాసన కూడా గుర్తించలేకపోతున్నారా? అయితే అనుమానించాల్సిందే.. అది కరోనా లక్షణం కావొచ్చు.. కరోనా సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం ఇది.. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 87శాతం COVID రోగులు తమ వాసనను కోల్పోతున్నారని నివేదించారు. 56 శాతం మంది తమ నాలుక రుచిని కోల్పోయారని చెప్పారు. ఈ లక్షణాల్లో ఒకటి లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం కరోనా వ్యాప్తిగా పరిగణించాలి.పొడి దగ్గు :
సాధారణంగా ఏదైనా వైరస్ లేదా బ్యాక్టిరీయా సోకినట్టు జలుబు దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.. దగ్గు ఉండటం చాలా రోగాల్లో సాధారణ లక్షణంగా సూచిస్తారు. అలెర్జీలు లేదా వాతావరణం కారణంగా కూడా దగ్గు వస్తుంటుంది.. శ్లేష్మం కారడం లేదా బయటకు ఉమ్మివేయడం ఉంటే పర్వాలేదు.. నిరంతరం పొడి దగ్గుతో వస్తే మాత్రం అనుమానించాలి.. వెంటనే మీరు COVID-19 టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే పొడి దగ్గు వైరస్ సాధారణ లక్షణాలలో ఒకటి అని హార్వర్డ్ మెడికల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

cough

అలసట :
విశ్రాంతి తీసుకున్నా కూడా అలసటగా అనిపిస్తోందా? ఏం పనిచేయకుండానే అలిసిపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. COVID-19 టెస్టు చేయించుకోండి.. నిపుణుల అభిప్రాయాన్ని ద్వారా సమస్యను పరిష్కరించండి. COVID-19 సాధారణ ప్రారంభ సంకేతాలలో ఒకటిగా పేరుపొందింది. 68.3 శాతం కరోనావైరస్ కేసులలో దీర్ఘకాలిక అలసటను గుర్తించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ( JAMA)లో ప్రచురించిన ఏప్రిల్ అధ్యయనం ప్రకారం… కరోనావైరస్ మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరణ ఇచ్చారు.. 60 శాతం COVID మరణాలు దీని ప్రభావం కారణంగానే నమోదవుతున్నాయని అధ్యయనం చెబుతోంది.జ్వరం :
JAMA అధ్యయనంలో.. సగం మందికి పైగా రోగులు (55 శాతం) జ్వరం ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నివారణ చర్యగా, మీ శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపిస్తే (100.5 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువ) వెంటనే జాగ్రత్తపడాలి. జ్వరంతో పాటు పైన చెప్పిన ఇతర లక్షణాలతో కూడా ఉంటే అనుమానించాల్సిందే.. మీ కుటుంబ సభ్యుల నుంచి వేరుగా ఉండండి.. వెంటనే COVID-19 టెస్టు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

READ  వైద్య రంగంలో సంచలనం: ఎయిడ్స్ రోగం నయం, ప్రపంచంలో రెండో వ్యక్తి

Related Posts