నీ ఫోన్ నీకు ఇవ్వాలంటే నీ పెళ్లాన్ని తీసుకురా..ఖాకీ కారుకూతలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ వ్యక్తి దగ్గర అన్యాయంగా ఫోన్ లాక్కుని ..నీ ఫోన్ నీకు కావాలంటే నీ భార్యని స్టేషన్ కు తీసుకురా..అంటూ ఓ ఎస్సై జులాయిలా మాట్లాడాడు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలింగ్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు తలవంపులు తెచ్చేలా జరిగిన ఈ ఘటన సిరిసిల్లా జిల్లాలో జరిగింది.

కరోనా నిబంధనల పేరుతో పోలీసులు సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తి అడ్డుకునే క్రమంలో చాలామంది పోలీసులు తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి డ్యూటీలు చేస్తుంటే కొంతమంది పోలీసులు మాత్రం డిపార్ట్ మెంట్ కే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అటువంటిదే సిరిసిల్లా జిల్లా వెంకట్రావు పేట గ్రామంలో చోటు చేసుకుంది.

వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్‌ మంగళవారం (ఆగస్టు 11,2020) రాత్రి 9.30 గంటలకు కోడిగుడ్ల కోసం ఇంటిపక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాడు. పక్కనే కదాని మాస్క్ పెట్టుకోకుండా వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి పెట్రోలింగ్‌కు వచ్చిన ఎస్సై, భాస్కర్‌ను చూశాడు.

ముఖానికి మాస్క్‌ ధరించలేదని కేసు నమోదు చేస్తానని బెదిరించి అతని వద్ద ఉన్నసెల్‌ఫోన్‌‌ను లాక్కున్నాడు. మరుసటిరోజు బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సార్..నా ఫోన్ ఇవ్వండి సార్ అని అడిగాడు. దానికి ఎస్సై అంతెత్తున ఎగిరాడు.. ‘నేను నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు నీ భార్యను కొడతవంటకదూ… వెళ్లి నీ భార్యను తీసుకుని రాపో. మీ ఇద్దరికీ నేను కౌన్సెలింగ్‌ చేశాకే, నీ ఫోన్‌ ఇస్తానని అన్నాడు.

భార్యాభర్తలన్నాక కేకలేసుకుంటాం..అంతమాత్రానే నా భార్యను స్టేషన్ కు తీసుకురావటమేంటి సార్..నా ఫోన్ నాకిచ్చేస్తే నేను వెళ్లిపోతానని భాస్కర్ బతిమాలుకున్నాడు. కానీ సదరు ఎస్సై వినలేదు. ఫోన్ కావాలంటే వెళ్లి నీ భార్యను తీసుకురా..లేదంటే ఇవ్వను అని తెగేసి చెప్పాడు.

అలా రెండు గంటలపాటు పోలీసు ఆవరణలో భాస్కర్ ని నిలబెట్టాడు. నువ్వు ఎంత సేపు నిలబెడ్డా నీ ఫోను నీకు ఇచ్చేది లేదు…నిన్ను స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటానని వేధిస్తున్నాడని బాధితుడు భాస్కర్ వాపోయాడు. తననుంచి ఫోన్‌ లాక్కున్నప్పుడే చూడు..నిన్ను స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటానని వార్నింగ్ ఇచ్చాడని వాపోయాడు.

తాను చేసిన చిన్న పొరపాటుకు నన్ను ఇలా వేధిస్తున్నాడనీ..భయభ్రాంతులకు గురి చేసిన ఎస్సై నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను కోరేందుకు వచ్చినట్లు బాధితుడు భాస్కర్ వాపోయాడు.

Related Posts